![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికే పద్నాలుగు వారాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న అమర్, ప్రశాంత్,యావర్, శివాజీ, ప్రియాంక ఫినాలే వీక్ లో ఉన్నారు. కాగా మొదటి రోజు అనగా సోమవారం నాటి ఎపిసోడ్ లో అమర్ దీప్, అంబటి అర్జున్ ల జర్నీ వీడియోలని చూపించిన బిగ్ బాస్ .. నిన్నటి ఎపిసోడ్ లో మొదట శివాజీ బ్లాక్ బస్టర్ జర్నీ చూపించి ఆ తర్వాత ప్రియాంక జర్నీని చూపించాడు బిగ్ బాస్.
మొదటగా గార్డెన్ ఏరియాలో ప్రియాంక హౌస్ లో గడిపిన కొన్ని జ్ఞాపకాలని ఫోటలలో చూపించగా.. ఒక బిబి మెమరీ గిఫ్ట్ అని శివ్ వచ్చినప్పటి ఫోటో చూసి ఇంప్రెస్ అయింది. ఎవరితో స్నేహం సరైనదో, ఆటలో ముందుకు వెళ్లేందుకు ఏ దారిని ఎంచుకోవాలో మీకు స్పష్టత ఉంది. ఇంటికి ఆయువుపట్టు లాంటి కిచెన్‌కి ఉన్న శక్తిని అర్థం చేసుకొని అక్కడి నుంచే మీ ఆటని కొనసాగించారు. సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు శివంగి ప్రియాంకగా మారి నామినేషన్లలో విరుచుకపడ్డ తీరు మీరేంటో అందరికీ అర్థమయ్యేలా చేసింది. ఎవరు ఎన్ని మాటలన్న వాటి నుంచి తేరుకొని మీ లక్ష్యంపై దృష్టి పెట్టారు తప్ప ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు అంటూ ప్రియాంక గురించి బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు.
ఇక తన జర్నీ వీడియో చూసుకొని ప్రియాంక తెగ ఎమోషనల్ అయిపోయింది. అసలు బిగ్‌బాస్ మాట్లాడుతుండగానే ప్రియాంక కంట్లో నీళ్లు వచ్చేశాయి. తన జర్నీని ఇంత అద్భుతంగా చూపించినందుకు సంతోషంతో ఉప్పొంగిపోయింది ప్రియాంక. అయిన ఫైనలిస్టుగా చోటు సంపాదించిన ప్రియాంక ఈ నాలుగు రోజులు హౌస్ లో ఉంటుందా లేదా చూడాలి మరి.
![]() |
![]() |